జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు | Special pooja in Jogulamba Temple | Sakshi
Sakshi News home page

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

Jun 16 2015 5:34 PM | Updated on Sep 3 2017 3:50 AM

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని చండీహోమాలు నిర్వహించారు.

అలంపూర్ రూరల్ (మహబూబ్‌నగర్) : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని చండీహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

మరోవైపు స్థానిక రేణుకా దేవి ఆలయంలో మంగళవారం సంతానలక్ష్మి పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాలో సంతాన లక్ష్మి పూజలు నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈవో గురురాజ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement