సూట్ కేసు రాజకీయం బాబుదే | sootcase politics are of chandrababu: shabbir ali | Sakshi
Sakshi News home page

సూట్ కేసు రాజకీయం బాబుదే

Jun 11 2015 2:53 PM | Updated on Aug 15 2018 9:27 PM

సూట్ కేసు రాజకీయం బాబుదే - Sakshi

సూట్ కేసు రాజకీయం బాబుదే

సూట్ కేసు రాజకీయం నడిపింది చంద్రబాబునాయుడేనని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు.

హైదరాబాద్: సూట్ కేసు రాజకీయం నడిపింది చంద్రబాబునాయుడేనని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయనను ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఆయన వేసిన రాజకీయ చదరంగంలో ఆయనే ఇరుక్కున్నారని చెప్పారు. ఇద్దరు చంద్రులు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ ఇద్దరు రాజకీయ విలువలు కాపాడటం లేదని చెప్పారు.

మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దృష్టంతా రాజధాని హైదరాబాద్‌పైనే ఉందని, రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను ఆయన పట్టించుకోవటం లేదని అన్నారు.  రైతులు రుణ మాఫీ కాక ఆందోళన చెందుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు.  దీనిపై తాము ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కమీషన్ల కోసమే వాటర్ గ్రిడ్ పథకం చేపట్టారని, కేసీఆర్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement