త్వరలో కొత్త విత్తన చట్టం | Soon the new Seed Act | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త విత్తన చట్టం

Jul 20 2017 1:40 AM | Updated on Sep 5 2017 4:24 PM

కాలం చెల్లిన విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం వస్తుందని వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నా రు. నాణ్యమైన విత్తనాల ధరలు సైతం రైతు లకు భారం కాకూడదన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కాలం చెల్లిన విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం వస్తుందని వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నా రు. నాణ్యమైన విత్తనాల ధరలు సైతం రైతు లకు భారం కాకూడదన్నారు. తెలంగాణను నాణ్యమైన విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిది ద్దేందుకు భారత–జర్మనీ దేశాల విత్తన రంగ అభివృద్ధి ప్రాజెక్టు ఆధ్వర్యంలో టెక్నికల్‌ వర్క్‌ షాప్‌ బుధవారం జరిగింది. వర్క్‌షాప్‌ కు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్స్‌మెన్‌ అసోసియేషన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సహా 60 మందికిపైగా విత్తన రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైవిధ్య వాతావర ణం, నేలల పరిస్థితుల మూలంగా నాణ్యమై న విత్తనాభివృద్ధికి అపార అవకాశాలున్నా యన్నారు. నకిలీల బెడద లేని నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన సరఫరా దిశగా తాము పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ విత్తన ధృవీకరణ, సరఫరాలో ఆన్‌లైన్‌ సేవలు తప్పనిసరని తెలంగాణ విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.కేశవులు వివరించారు.  తమ దేశంలో పంట రకం రిజిస్ట్రేషన్, విత్తన ధృవీకరణ తప్పనిసరని జర్మనీ ఫెడరల్‌ ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెర్మన్‌ హుక్కెర్ట్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement