కూర తేలేదని తల్లిని చంపిన కొడుకు | son kills mother for curry in mahabubnagar district | Sakshi
Sakshi News home page

కూర తేలేదని తల్లిని చంపిన కొడుకు

Aug 5 2014 12:08 AM | Updated on Oct 8 2018 5:04 PM

తినడానికి కూర తీసుకురాలేదని కొడుకు కన్నతల్లిని చంపేశాడు.

కోస్గి: తినడానికి కూర తీసుకురాలేదని కొడుకు కన్నతల్లిని చంపేశాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ విషయం సోమవారం వేకువజామున వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

గుండుమాల్‌కు చెందిన లంగరి రాజమ్మ (60) భిక్షాటన చేస్తూ జీవించేది. ఆమె కొడుకు అంజిలయ్య తాగుడుకు బానిసై అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఆదివారం రాత్రి తినడానికి కూర తీసుకు రాలేదని తల్లితో గొడవకు దిగాడు. పక్కింట్లోంచి తీసుకువస్తా.. ఆగమని చెప్పినా వినకుండా రోకలిబండతో ఆమె తలపై కొట్టాడు. దీంతో రాజమ్మ అక్కడికక్కడే మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement