సింగరేణిలో బంకర్ కూలి కార్మికుడి మృతి | singareni worker died in bunker collapse | Sakshi
Sakshi News home page

సింగరేణిలో బంకర్ కూలి కార్మికుడి మృతి

Jun 24 2015 10:13 AM | Updated on Sep 28 2018 3:41 PM

ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీరాంపూర్‌కు చెందిన శ్రీకాంత్(26) సీహెచ్‌పీ ప్రాంతంలోని బంకర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అది కూలటంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న మరో ఏడుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిథిలాల నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.
(శ్రీరాంపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement