ముగిసిన షీటీమ్స్‌ శిక్షణ

She Teams Training Program Concluded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మహిళల భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ నిర్వహణ, కేసుల్లో విచారణ, వేధింపుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై పలు జిల్లాల అధికారులకు, సిబ్బందికి ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. అన్ని జిల్లాల అధికారులకు శిక్షణ అందించేందుకు నెల రోజుల క్రితం పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి రెండు రోజులకొక బ్యాచ్‌ చొప్పున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగియడంతో సంబంధిత అధికారులకు షీటీమ్స్‌ ఇన్‌చార్జి స్వాతి లక్రా సర్టిఫికెట్లు అందజేశారు.

షీ టీమ్‌ సభ్యులు జెండర్‌ సెన్సిటైజేషన్, సమాజంలో మహిళల స్థాయి, మహిళలపై వేధింపులు, ఆధారాలను సేకరించడం, సాఫ్ట్‌స్కిల్స్, మైనర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాల పట్ల శిక్షణ ఇచ్చారని స్వాతి లక్రా తెలిపారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ జిల్లాల నుంచి షీటీమ్‌ అధికారులు పాల్గొన్నారని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top