
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొందరు మున్సి పల్ కమిషనర్లు తెలంగాణ మున్సి పాలిటీ 1965, 2019 చట్టాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పాలన విభాగం డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.