ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్‌ | Senior Congress leader MLC Damodar Reddy to join TRS today | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్‌

Dec 20 2018 2:46 AM | Updated on Mar 18 2019 7:55 PM

Senior Congress leader MLC Damodar Reddy to join TRS today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు. దామోదర్‌రెడ్డి ఫిరాయింపునకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహించారని, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని తాము ఫిర్యాదు చేసినా నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన మండలి చైర్మన్‌ గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement