breaking news
Sabbirali
-
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డి ఫిరాయింపునకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని తాము ఫిర్యాదు చేసినా నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన మండలి చైర్మన్ గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మల్లన్నసాగర్‌తో కామారెడ్డికి అన్యాయమే
కామారెడ్డి : ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి అన్యాయం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డికి నీళ్లివ్వడం సాధ్యం కాదని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా కామారెడ్డి ప్రాంతానికి నీటినందించేందుకు పనులు ప్రారంభించారన్నారు. 22వ ప్యాకేజీ ద్వారా కామారెడ్డి పనులు చేపడితే సాగునీటి కష్టాలు తీరుతాయనుకుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో పనులను వదిలేసిందన్నారు. మల్లన్నసాగర్ విషయంలో ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరివ్వడం సాధ్యం కాదని నిపుణులు ఇచ్చిన రిపోర్టులు తన వద్ద ఉన్నాయని.. దీనిపై మంత్రి హరీశ్‌రావు, విప్ గోవర్ధన్ స్పష్టం చేయాలన్నారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది తమ హయాంలోనేనని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, సీడీసీ చైర్మన్ అశోక్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శి అశోక్, నేతలు అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రాంకుమార్, మోహన్, గోనె శ్రీను, బాబా,తదితరులున్నారు. రెండో ఏఎన్ఎంల సమ్మెకు సంఘీభావం.. రెండో ఏఎన్ఎంల సమ్మెకు షబ్బీర్‌అలీ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరానికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు. 14 రోజులుగా ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. -
కాంగ్రెస్ ధర్నా ఉద్రిక్తం..
కరీంనగర్ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు నేతల యత్నం పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా తోపులాట జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం సహా పలువురు నేతల అరెస్టు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు లాఠీచార్జి చేసిన పోలీసులు.. నిరసనగా రోడ్డుపై బైఠాయింపు సీఎం కేసీఆర్‌పై పొన్నాల, జానా, డీఎస్, షబ్బీర్ ఫైర్ కరీంనగర్: వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. దీంతో పలువురు నేతలు కింద పడిపోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కదిలేది లేదంటూ భీష్మించి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా ఎత్తుకెళ్లి జీపులో ఎక్కించారు. కానీ ఆ వాహనాన్ని కదలనీయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు రైతులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తప్పించడానికి లాఠీచార్జి చేశారు. దీనిని నిరసిస్తూ.. జీవన్‌రెడ్డి జీపులోంచి దూకి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆయన కు మద్దతుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు తదితరులు అక్కడే బైఠాయించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య తక్షణమే అక్కడికి వచ్చి ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా.. తొలుత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, రైతులతో కలసి ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నా రు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జి.వివేక్, కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ ధర్నాలో పాల్గొన్నారు. బుద్ధి చెబుతాం: డీఎస్ ‘‘కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను శాసనసభ, శాసనమండలిలో నిలదీస్తాం. కేసీఆర్‌కు బుద్ధి చెబుతాం. కేసీఆర్ మోసాలు రైతులు, ప్రజలకు అర్థమయ్యాయి. వారి తో కలసి కాంగ్రెస్ కార్యకర్తలంతా విజృంభించండి. మేమంతా అండగా ఉంటాం.’’ కనీవినీ ఎరగని పాలనంటే ఇదేనా?: షబ్బీర్‌అలీ ‘‘ప్రపంచంలో కనీవినీ ఎరుగని పాలన అందిస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతుండు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ నాలుగు నెలల పాలనలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. కనీవినీ ఎరుగని పాలనంటే ఇదేనా? కేసీఆర్.. కరెంటు అడిగిన పాపానికి రైతులపై లాఠీచార్జి చేస్తావా? బంగారు పాలనంటే ఇదేనా?’’ రెండు గంటలూ దిక్కులేదు: జీవన్‌రెడ్డి ‘‘తెలంగాణ వస్తే కష్టాలన్నీ తీరుతాయంటే పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లయింది. 8 గంటల ఉచిత కరెంటు ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు రెండు గంటలు కూడా సరఫరా చేయడం లేదు. ఎండిపోతున్న పంటలకు, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.’’