ఆ పథకాలు కేసీఆర్‌ ప్రకటించిన వరాలు: గుత్తా

Schemes Gifted By CM KCR Says TRS MP Gutha Sukender Reddy - Sakshi

సాక్షి, నల్గొండ : కోటిఎనభై లక్షలతో బత్తాయి మార్కెట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం రైతులకు సంతోషకరమైన విషయమని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 2.5 లక్షల ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బ్రాహ్మణ వెళ్ళంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో నీరు అందిస్తామని ప్రకటించారు. భూ రికార్డుల ప్రక్షాళన, ఎకారాకు ఎనిమిది వేల రైతు పెట్టుబడి, యాబై లక్షల రైతులకు ఐదు లక్షల బీమా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఇచ్చిన వరాలని పేర్కొన్నారు. 130 కోట్లతో నల్గోండలో ఇంటింటికి నీరు అందించేందుకు సర్వం సిద్దమవుతోందని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించింనందుకు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top