
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నంబరు జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది.