గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేయండి | MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi In Delhi | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేయండి

Aug 5 2023 4:46 AM | Updated on Aug 5 2023 8:10 AM

MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ టు విజయవాడ జాతీయరహదారి(65)లో మల్కాపూర్‌ నుంచి విజయవాడ వరకు ఉన్న స్ట్రెచ్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేగా చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అత్యంత రద్దీ ఉన్న ఈ రూట్‌లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల దోపిడీ ఎక్కువైందని, ఈ విద్యాసంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోమటిరెడ్డి కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానిని కలిసిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement