జాతర బందోబస్తులో అపశ్రుతి
మండలంలోని నీరుకుళ్ల సమ్మక్క-సారలమ్మ జాతరబందోబస్తులో అపశ్రుతి దొర్లింది.
ఎస్సై, గన్‌మెన్‌కు తీవ్రగాయాలు
సుల్తానాబాద్ :మండలంలోని నీరుకుళ్ల సమ్మక్క-సారలమ్మ జాతరబందోబస్తులో అపశ్రుతి దొర్లింది. సుల్తానాబాద్ ఎస్సై ఇంద్రసేనారెడ్డి, ఆయన గన్‌మెన్ గాయపడ్డారు. బందోబస్తులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ట్రాఫిక్ అంతారాయం కలుగకుండా చూసేందుకు ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఎస్సారెస్పీ కాలువకు 100 మీటర్ల దూరంలో స్పీడ్‌బ్రేకర్ ఉండడంతో గమనించలేదు. స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పడంతో ఎస్సారెస్పీ కాలువలో వాహనంతోసహా పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఎస్సై ఇంద్రసేనారెడ్డితోపాటు ఆయన గన్‌మెన్ నరేశ్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి సుల్తానాబాద్ వరకు తీసుకువచ్చారు. స్థానిక సీఐ తుల శ్రీనివాస్‌రావు తన వాహనంలో హుటాహుటిన కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరినీ ఐసీయూలో చేర్చి చికిత్స చేస్తున్నారు. డీఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.


