25 తులాల బంగారం చోరీ | Robbery in Peddapur | Sakshi
Sakshi News home page

25 తులాల బంగారం చోరీ

Jan 10 2016 11:32 AM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు పడి 25 తులాల బంగారం, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు.

కోరుట్ల (కరీంనగర్) : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు పడి 25 తులాల బంగారం, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పెద్దపూర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రెండిళ్లలో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 50 వేల నగదుతో పాటు 25 తులాల బంగారునగలు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన  పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement