‘కిక్’ కోసం దొంగతనం! | robbery due to their kick | Sakshi
Sakshi News home page

‘కిక్’ కోసం దొంగతనం!

Jun 14 2015 9:27 AM | Updated on Aug 30 2018 5:27 PM

గోడపై కిక్, కేకే 786 అని రాసిన దొంగలు - Sakshi

గోడపై కిక్, కేకే 786 అని రాసిన దొంగలు

‘కిక్’ సినిమాలో హీరో రవితేజలా దొంగతనం చేసి కిక్కు పొందాలనుకున్నారో ఏమో గానీ..

ఆదిలాబాద్: ‘కిక్’ సినిమాలో హీరో రవితేజలా దొంగతనం చేసి కిక్కు పొందాలనుకున్నారో ఏమో గానీ.. జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో  జరిగిన చోరిని చూస్తే అలాగే అనిపిస్తోంది. దొంగతనానికి వచ్చిన దొంగలు తమ పని పూర్తి చేసుకొని ఎప్పుడు వెళ్లిపోదామని చూస్తుం టారు. కానీ ఇక్కడ దొంగతనం చేసిన వారు మాత్రం దర్జాగా ‘కిక్’, కేకే 786 అంటూ సినిమా పేరు రాసి మారి వెళ్ల డం అందరినీ విస్మయానికి గురిచేసింది.
 
పట్టణంలోని ఆరాధన బట్టల దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగలు దుకాణం వెనుక గోడ(మూడంతస్తులు)ను తాడు సహాయం తో సినిమా ఫక్కీలో ఎక్కి మరీ దొంగతనం చేశారు. రూ.5 వేల నగదుతోపాటు, విలువైన బట్టలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ రఘు వివరాలను సేకరించారు. క్లూస్ టీంలతో అణువణువూ తనిఖీ చేరుుంచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement