చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని సస్పెండ్ చేశారు | revanth reddy takes on telangana government | Sakshi
Sakshi News home page

చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని సస్పెండ్ చేశారు

Nov 17 2014 3:10 PM | Updated on Aug 11 2018 6:42 PM

చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని సస్పెండ్ చేశారు - Sakshi

చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని సస్పెండ్ చేశారు

చిన్న చిన్న కారణాలతో అసెంబ్లీ చట్టాలు ఉల్లంఘించి టీడీపీ సభ్యల్ని సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్:చిన్న చిన్న కారణాలతో అసెంబ్లీ చట్టాలు ఉల్లంఘించి టీడీపీ సభ్యల్ని సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను సభలో ఉంటే వారి బండారం బయడపడుతుందనే బయటకు పంపారని మండిపడ్డారు. మై హోంకు ప్రత్నామ్నాయ భూ కేటాయింపులపై రూల్ 43ప్రకారం స్పీకర్ కు నోటీసులు ఇచ్చానని, భూ బదాయింపులపై సంపూర్ణ సమాచారంతో అన్ని పార్టీలకు నివేదికలు ఇచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

డీఎల్ఎఫ్ సంస్థకు కేటాయించిన ఎకరం రూ. 18 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా మైం హోం కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు. అదే రేటుకు ఎకరా రూ. 50 కోట్ల విలువ చేసే రోడ్డుపై ఉన్న భూములను మైం హోంకు ఇస్తాననడం ఎంతవరకూ న్యాయమని రేవంత్ ప్రశ్నించారు. అనుమతులు లేవని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చినట్లు ఈ అంశంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు. మై హోం భూ కేటాయింపులపై హౌస్ కమిటీ వేయాలని.. ఆ కమిలీలో నాకు స్థానం కల్పించాలన్నారు. భూ బదాలాంపుల్లో ప్రభుత్వ ఖజనాకు రూ.100 కోట్ల నష్టం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement