ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభం | Reliance Smart Outlet Opens In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభం

Jul 31 2019 8:47 PM | Updated on Jul 31 2019 8:57 PM

Reliance Smart Outlet Opens In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ శ్రేణి రిలయన్స్ స్మార్ట్ ఖమ్మంలో త‌న కొత్త స్టోర్‌ను వైఎస్ టవర్స్, ఎన్ఎస్టి రోడ్, బాలాజీ నగర్లో  బుధవారం ప్రారంభించింది. బ‌హుళ‌ విధ‌మైన ఉత్ప‌త్తులను క‌లిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్ప‌త్తులు, పండ్లు, కూర‌గాయ‌లు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్‌వేర్‌, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి. నాణ్య‌మైన ఉత్ప‌త్తులు  ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంతో పాటు వారి దైనందిన అవ‌స‌రాల‌ను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిల‌వ‌నుంది. 

ఈ స్టోర్‌లో వినియోగ‌దారులు చెల్లించే మొత్తానికి త‌గిన నాణ్య‌మైన ఉత్పత్తులు అందించ‌డంతో పాటుగా ఎంఆర్‌పీపై క‌నీసం 6% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై సంవత్సరం పొడ‌వునా అందిస్తోంది. దీంతోపాటు రూ.1499 విలువ గ‌ల వస్తువులు కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌డం వంటి ఇత‌ర ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా తమ నెల‌వారీ కిరాణ స‌రుకుల కోసం ఎంచుకోద‌గిన ఉత్త‌మ‌మైన సూప‌ర్‌ మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీట‌న్నింటితో పాటు ప్ర‌ధాన‌మైన ఉత్ప‌త్తులను, పండ్లు మ‌రియు కాయ‌గూర‌ల‌పై ప్ర‌తిరోజూ త‌క్కువ ధ‌ర‌లకే అందిస్తోంది.

తాజాగా ప్రారంభమైన ఖమ్మం స్టోర్‌ క‌లుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 18కు చేరుకుంది. 29,800 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్త‌మ‌మైన డిజైన్ మ‌రియు లేఔట్ క‌లిగి ఉంది. `ప‌వ‌ర్ ఆఫ్ 9` పేరుతో క‌ల్పించిన ప్రారంభోత్స‌వ ఆఫ‌ర్ ద్వారా ఉల్లిగ‌డ్డ‌లు, కొబ్బ‌రికాయ‌లు, ప్లాస్టిక్ కంటెయిన‌ర్ల సెట్ వంటి అనేక ఉత్ప‌త్తులు కేవ‌లం రూ.9 కే (వీటి మార్కెట్‌ ధ‌ర క‌నీసం రూ.999 ఉంటుంది) అందించ‌డం వ‌ల్ల అనేక‌మంది వినియోగ‌దారులు ఆక‌ర్షితులు కానున్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా రిలయన్స్ స్మార్ట్ త‌న వినియోగ‌దారులకు సంబంధించిన దైనందిన మ‌రియు ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు త‌గిన అవ‌స‌రాల‌ను అన్ని ర‌కాలైన ధ‌ర‌ల‌తో కూడిన ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. వినియోగ‌దారుడిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్త‌మ షాపింగ్ అనుభూతిని త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు అందిస్తూ వినియోగ‌దారుల‌కు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన‌దే కాకుండా స్థ‌లం ప‌రంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది. నేడు రిలయన్స్ స్మార్ట్ స్టోర్ లు దేశవ్యాప్తంగా 100 కు పైగా నగరాలలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement