బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి పంటలకు నీరందించాలని కోరుతూ నల్లగొండ జిల్లా భువనగిరిలో రైతులు దీక్షలు ప్రారంభించారు.
బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి పంటలకు నీరందించాలని కోరుతూ నల్లగొండ జిల్లా భువనగిరిలో రైతులు దీక్షలు ప్రారంభించారు. భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మొదలైన ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బునాదిగాని కాల్వపనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే పనులను పూర్తి చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలు మరో రెండు రోజులు కొనసాగుతాయి. 25న ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.