ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బంది శనివారం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు.
ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్
ముకరంపుర : ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బంది శనివారం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా వచ్చారు. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. ఉపాధిహామీ సిబ్బంది జిల్లా కమిటీ జేఏసీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ఆరు రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
కేడర్ ప్రకారం పే స్కేలు రివిజన్ చేసి జీతభత్యాలను 43 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. తె లంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్‌ను అందజేయాలని, కాంట్రాక్ట్ ఉ ద్యోగుల కోసం గతంలో హెచ్‌ఆర్ పాలసీ ద్వారా విడుదల చేసిన కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీని ఉద్యోగుల ప్రమోషన్ల కోసం అమలు చేయూలని కోరారు. జీవో 491ను రద్దుచేస్తూ సీనియర్ మేట్లుగా మారిన వారిని తిరిగి ఎఫ్‌ఏలుగా నియమించాలన్నారు. సమన్వయకర్తలు రాపోలు నాగరాజు. మం చికట్ల శ్రీనివాస్, జేఏసీ కో చైర్మన్లు బాలలింగం, సత్యప్రకాశ్, జగదీష్, కిషన్, జమీల్, లక్ష్మణ్, సబ్యులు లక్ష్మీ పెరిందేవి, వేణు, లక్ష్మయ్య, రాజు, రమేశ్, మమత, రజినీకాంత్, సాయిశ్రీ, రమేశ్, ఆంజనేయులు, సంతోష్ పాల్గొన్నారు.