ఎంటెక్‌లో తగ్గిన ప్రవేశాలు

Reduced entries in the Mtech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య ఈసారి తగ్గిపోయింది. గతేడాది తో పోలిస్తే ఈసారి విద్యార్థుల సంఖ్య 400కు పైగా తగ్గిపోయింది. గతేడాది రాష్ట్రంలోని 168 కాలేజీల్లో 8,374 సీట్లు ఉంటే 7,523 మంది కాలేజీల్లో చేరారు. ఈసారి 242 కాలేజీల్లో 8,967 సీట్లు ఉండగా 7,185 మంది మాత్రమే చేరారు. గతేడాది కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ కాలేజీల్లో చేరినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎంటెక్‌ లో గతేడాది 851 సీట్లు మాత్రమే మిగిలిపోగా.. ఈసారి 1,782 సీట్లు మిగిలాయి. 

సగానికి పైగా తగ్గిన సీట్లు..:  నాలుగేళ్లలో ఎంటెక్‌లో సీట్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. 2015 విద్యా సంవత్సరంలో 21,750 సీట్లు అందుబాటులో ఉండగా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు, యాజమాన్యాలే స్వయంగా సీట్లను తగ్గించుకోవడం వల్ల ప్రస్తుతం వాటి సంఖ్య 8,967కు చేరింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top