మందకృష్ణ, గద్దర్, మీరాలను ఎదిరిస్తా.. | reay to face Warangal Lok Sabha constituency war says pidamarthi ravi | Sakshi
Sakshi News home page

మందకృష్ణ, గద్దర్, మీరాలను ఎదిరిస్తా..

Aug 9 2015 9:26 AM | Updated on Oct 8 2018 3:00 PM

సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి
వరంగల్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తే మంద కృష్ణమాదిగ, గద్దర్, పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమార్‌లను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా లద్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడారు. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఒక సాథనంలో పోటీ చేసేందుకు దళితుడిని తయారు చేసేకోలేకపోయిందన్నారు.

పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడిన టీఆర్‌ఎస్ పార్టీ పోటీచేసే పది మంది దళితులను తయారు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సీఎం ఎవరిని నిలబెట్టిన వారి గెలుపు కోసం కృషిచేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement