బాలికను ఆస్పత్రిలోంచి తీసుకెళ్లి అత్యాచారం! | Rape on seven years old girl | Sakshi
Sakshi News home page

బాలికను ఆస్పత్రిలోంచి తీసుకెళ్లి అత్యాచారం!

Mar 27 2017 1:13 AM | Updated on Aug 21 2018 5:51 PM

ఓ దుండగుడు ఆస్పత్రిలోంచి ఏడేళ్ల్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
నిందితునికోసం గాలింపు


తాండూరు టౌన్‌: ఓ దుండగుడు ఆస్పత్రిలోంచి ఏడేళ్ల్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు జిల్లా ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ దారుణ జరిగింది. సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం ఎల్మకన్నె కుచెందిన బాలిక (7) తన అమ్మమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం మేనమామతో కలసి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. కాస్త చీకటి పడుతుండగా బాలిక మేనమామ తిని వస్తానని బయటకు వెళ్లాడు.

అమ్మమ్మ వద్ద ఉన్న బాలిక కూడా ఆకలిగా ఉందని చెప్పడంతో అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను బయటకు తీసుకెళ్లి ఏమైనా తినిపించుకొని వస్తానని చెప్పి తీసుకెళ్లాడు.ఎంతసేపటికి బాలిక రాకపోవడం తో ఆమె మేనమామ  పట్టణంలో వెతికాడు. అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్న మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుడు హుసేనప్ప తాండూరు ఫ్లై ఓవర్‌ వద్ద ముఖానికి కర్చీఫ్‌ చుట్టుకుని ఉన్న ఓ వ్యక్తి బాలికను తీసుకుని అటుగా వెళ్తుండడం గమనించాడు. అనుమానంతో ప్రశ్నించాడు. దీంతో అతడు ఆమెను వదిలేసి పారిపోయాడు. వెంటనే హుసేనప్ప పారిశుద్ధ్య సూపర్‌వైజర్‌ రమేష్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు.

కార్మికులు బాలికను ఠాణాకు తరలించారు. సాయంత్రం తప్పిపోయిన బాలిక అయి ఉంటుందనే అనుమానంతో రమేష్‌ తన ఫోన్‌లో ఫొటో తీసి ఆస్పత్రిలో ఉన్న బంధువులకు చూపగా బాలికను గుర్తించారు. తీవ్ర రక్తస్రావంతో బాలిక సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.నిందితుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలోనూ, పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు.   బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను మంత్రి మహేందర్‌రెడ్డి ఖండించారు. నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement