పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై సూచిక(ఫర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)లు ప్రవేశపెట్టే ఆలోచనలు ప్రారంభమయ్యాయి.
భద్రాచలంలో ఈ నెల 28న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భద్రగిరి ముస్తాబవుతోంది. దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి స్వామివారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. స్వామి పెళ్లి తలంబ్రాలను భక్తులందరికీ అందించేందుకుగాను 60 క్వింటాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావుతోపాటు, మంత్రులు, ఇతర వీఐపీలు ఈసారి ఎక్కువగానే రావచ్చని అంటున్నారు.