మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీ రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) పై ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా అచ్చంపేటలో శనివారం భారీ ర్యాలీ జరిగింది.
ఎఫ్‌ఆర్‌వోపై దాడికి నిరసనగా ర్యాలీ
Feb 20 2016 2:28 PM | Updated on Sep 3 2017 6:03 PM
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీ రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) పై ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా అచ్చంపేటలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. అటవీ శాఖకు చెందిన అతిథి గృహం కేటాయింపు విషయంలో ఎఫ్‌ఆర్‌వో రామేశ్వర్‌రెడ్డి పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేసిన విషయం విదితమే.
ఈ ఘటనకు నిరసనగా అటవీ సిబ్బంది పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. దాడులకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవీందర్, మాజీ ఎమ్మెల్యే రాములు, ఎఫ్‌ఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి విజయానందరావు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement