కేసీఆర్ను కలిసిన రాజయ్య | Rajaiah meets telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలిసిన రాజయ్య

Feb 2 2015 4:21 PM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్ను కలిసిన రాజయ్య - Sakshi

కేసీఆర్ను కలిసిన రాజయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. మంత్రవర్గం నుంచి బర్తరఫ్ ..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. మంత్రవర్గం నుంచి బర్తరఫ్ తర్వాత రాజయ్య తొలిసారిగా కేసీఆర్ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే.  ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. కాగా ఆ తర్వాత రాజయ్య...సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించలేదు. సీఎంతో భేటీ వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement