బీసీలకు వెయ్యి కోట్లు కేటాయించాలి: ఆర్‌ కృష్ణయ్య

R Krishnaiah Demanded 1000 Crore Funds For BCs  - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో బీసీలకు రూ. 50వేల కోట్లు కేటాయించాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలకు వెయ్యి కోట్లు ఏం సరిపోతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, సామాజిక న్యాయ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ ను ప్రశ్నించారు.  తాజాగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో బీసీల గణనను కూడా చేర్చాలని కోరారు. చట్ట సభల్లో సాధారణ  బీసీ రిజర్వేషన్లను 50శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. తాజా జనాభా లెక్కల సేకరణ పత్రం నమూనా కాలమ్‌లో బీసీల వివరాలకు సంబంధించిన కాలమ్‌ ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ 18 డిమాండ్లపై పార్టీలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా, కేంద్ర మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top