సైకో దాడి : వృద్ధుడికి గాయాలు | psycho attacks on old man in nizamabad distirict | Sakshi
Sakshi News home page

సైకో దాడి : వృద్ధుడికి గాయాలు

Feb 21 2015 2:34 PM | Updated on Oct 17 2018 6:06 PM

సైకో దాడి : వృద్ధుడికి గాయాలు - Sakshi

సైకో దాడి : వృద్ధుడికి గాయాలు

ఓ సైకో దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

నిజామాబాద్ : ఓ సైకో దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సజ్జనపల్లి గ్రామానికి చెందిన పొమ్యా నాయక్(75) హోటల్‌లో టీ తాగి ఇంటికి వెళ్తుండగా..  అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని నారాయణ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

పొమ్యానాయక్‌ను కిందకు తోసేసి బ్లేడుతో పురుషాంగాన్ని కోసేశాడు. తీవ్రంగా గాయపడిన పొమ్యా నాయక్‌ను 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైకో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు గతంలోనూ ఒక వ్యక్తిని కర్రతో కొట్టి చంపినట్టు సమాచారం.
(లింగంపేట)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement