
తాళం వేయడంతో నిరీక్షిస్తున్న సిబ్బంది
ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న సబ్‌పోస్టాఫీస్ భవనానికి సంబంధించిన అద్దె ఇవ్వడం లేదని భవన యజమాని మంగళవారం పోస్టాఫీస్‌కు తాళం వేశాడు. పోస్టుమాస్టర్ రవికుమార్ వివరాల ప్రకారం... ఎలిగేడులో సబ్‌పోస్టాఫీస్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. 2012– 17వరకు అగ్రిమెంట్‌తో రూ.2500 చెల్లిస్తున్నారు.
2018వరకు గ్రేస్‌పిరియడతో నడుస్తుండగా ఐదు నెలల క్రితం యజమాని అద్దెను 4500 పెంచి ఇవ్వాలని కోరాడు. విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించారు. ఇప్పటి వరకు ఎలాంటి అద్దె రాకపోవడంతో పాటు, పెంచిన అద్దెపై స్పష్టత ఇవ్వకపోవడంతో యజమాని మంగళవారం తాళం వేశాడు. దీంతో మంగళవారం విధులకు వచ్చిన సిబ్బంది బయటే నిరీక్షించారు.