ఆరు కిలోల ఎండు గంజాయి పట్టివేత | police seized 6 kg ganja in medak district | Sakshi
Sakshi News home page

Feb 14 2018 4:49 PM | Updated on Sep 5 2018 8:44 PM

police seized 6 kg ganja in medak district - Sakshi

పట్టుకున్న గంజాయితో సీఐ శ్రీనివాస్‌రెడ్డి

నారాయణఖేడ్‌: మండలంలోని అనంతసాగర్‌ గ్రామంలో కుమ్మరి పుండ్లిక్‌ ఇంటిపై దాడి చేసి ఆరు కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కుమ్మరి పుండ్లిక్‌ ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు.

అతడి ఇంటిలో ఆరు కిలోల 100 గ్రాముల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు న మోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కేసును ఖేడ్‌ ఎక్సైజ్‌ సీఐ మహేష్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ గౌడ్‌లకు అప్పగించామని సీఐ వివరించా రు. ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు అలీం, సిద్ధయ్య, జాకబ్, సోమయ్య పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement