
తీవ్రవాదులకోసం ముమ్మర గాలింపు చర్యలు
కర్ణాటక సరిహద్దులోని మల్గి గ్రామంలో తీవ్రవాదులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే కారణంతో పెద్ద ఎత్తున గ్రామంలో పోలీసులు మోహరించారు.
మెదక్ : కర్ణాటక సరిహద్దులోని మల్గి గ్రామంలో తీవ్రవాదులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే కారణంతో పెద్ద ఎత్తున గ్రామంలో పోలీసులు మోహరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో శనివారం ఆరుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలతో సహా 200 మంది సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మల్లి గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. గ్రామంలోని ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు తనిఖీలు చేస్తున్నారు.
(న్యాల్‌కల్)