పోలీసుల అదుపులో చిట్టీల మోసగాడు! | police held chits cheater | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో చిట్టీల మోసగాడు!

May 17 2015 5:37 PM | Updated on Sep 3 2017 2:14 AM

చిట్టీల పేరుతో కోటి రూపాయల మేర ప్రజల నుంచి వసూళ్లు చేసి పరారయిన వ్యక్తిని నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

నకిరేకల్ (నల్లగొండ): చిట్టీల పేరుతో కోటి రూపాయల మేర ప్రజల నుంచి వసూళ్లు చేసి పరారయిన వ్యక్తిని నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడి విచారిస్తున్నారు.

నకిరేకల్ మూసీ రోడ్డులో ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్న రాచకొండ శ్రీనివాస్ రూ.కోటి చిట్టీల మోసం కేసులో పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో కొందరు బాధితులు ఆదివారం స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement