పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. 295 వాహనాలు సీజ్‌

Police Cordon And Search In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక సంఖ్యలో సరైన ద్రువపత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేశారు. రఘునాథ్‌పాలెం పోలీసు స్టేషన్‌ పరిధిలోని శివాయిగూడెం కాలనీలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వయించారు. ఖమ్మం పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, రూరల్‌ ఏసీపీ నరేష్‌ రెడ్డి ఆధ్యర్యంలో ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తనీఖీలు నిర్వహించారు. మొత్తం 16 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ తనీఖీల్లో పోలీసు కమీషనర్‌, రూరల్‌ ఏసీపీతో పాటు 110 మంది కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.  

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి 11 గంటలకు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. మొత్తంగా 150 ఇళ్లను, 500 మంది వ్యక్తులను, 150 ద్విచక్ర వాహనాలను, 2 కార్లను తనీఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. 5 గురు అనుమానితులను కూడా విచారించినట్టు సమాచారం. ఈ తనీఖీలో అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌ డి.ఉదయ్‌ కుమార్‌, జిల్లా డీఎస్పీ ఎస్‌.ఎం అలీ తో పాటు ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 200 మంది పోలీసు అధికారులు ఈ తనీఖీల్లో పాల్గొన్నారు.

పెద్దపల్లి, సూర్యపేట జిల్లాల్లో కూడా పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. పెద్దపల్లి సుభాష్‌ నగర్‌, సాగర్‌ రోడ్డులో 95 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 ట్రాలీని అలాగే సూర్యపేట జిల్లాలో బంజర కాలనీ, అంబేద్కర్‌ కాలనీలో 121 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 వ్యాన్‌ స్వాధీన పర్చుకున్నట్టు పోలీసు తెలిపారు. సూర్యపేట తనీఖీల్లో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌ జాదవ్‌, కోదాడ డీఎస్పీ రమణరెడ్డి, మగ్గురు సీఐలు, 16 మంది ఎస్సైలతో పాటు 160 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో డీఎస్పీ కె.నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లాలోని చిలుకూరి లక్ష్మి నగర్‌, మహా లక్ష్మి వాడలో 200 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటి సోదాలు నిర్వహించి 39 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ఆటో ట్రాలీలను సాధ్వీనం చేసుకున్నట్టు పోలీసు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top