దాబాపై పోలీసుల దాడి | police attacks on dhaba in nalgonda distirict | Sakshi
Sakshi News home page

దాబాపై పోలీసుల దాడి

Apr 21 2015 12:15 PM | Updated on Jul 18 2019 2:26 PM

అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసులు దాడి చేశారు.

నల్లగొండ : అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసులు దాడి చేశారు. జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గుంటూరు రహదారిలో ఉన్న గోకుల్ దాబాలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాబాపై సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 158 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు దాబాల్లో 10 గంటల తర్వాత అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. అయినా, నోటీసులను ఖాతరు చేయకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మిర్యాలగూడ)
 

Advertisement
 
Advertisement
Advertisement