నేటి నుంచి కంది కొనుగోళ్లు బంద్‌ | Pigeon pea purchases bandh from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కంది కొనుగోళ్లు బంద్‌

Feb 28 2018 1:51 AM | Updated on Oct 1 2018 2:19 PM

Pigeon pea purchases bandh from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంది కొనుగోలు కేంద్రాలను బుధవారం నుంచి మూసేయాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయిలో కందుల కొనుగోలు ప్రక్రియ ముగియలేదు. అనేక చోట్ల కందులను రైతులు మార్కెట్‌కు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను మూసివేయడంపై విమర్శలు వస్తున్నా యి. మార్క్‌ఫెడ్‌ ఏర్పాటుచేసిన 93 కొనుగోలు కేంద్రాల్లో 40 కేంద్రాలను ఇటీవల మూసేశారు. మిగిలిన 53 కేంద్రాలను ఇప్పుడు మూసివేయ నున్నారు. హాకా ఆధ్వర్యంలో ప్రారంభమైన 48 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 44 కేంద్రాలను మూసేశారు.

మరో నాలుగు కేంద్రాలను కూడా మూసివేసేందుకు హాకా నిర్ణయించింది. రాష్ట్రంలో 2.95 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు ఉత్పత్తి అవుతాయని అంచనా. మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.08 లక్షల మెట్రిక్‌ టన్నులు, హాకా ద్వారా 1.18 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.  కేంద్రం మద్దతు ధర కింద 75,300 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేస్తామని చెప్పడంతో, మిగిలిన కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇది సర్కారుకు తలకు మించిన భారం కావడంతో మూసివేయాలని నిర్ణయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement