టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఫహీం | Phahim Is The General Secretary Of TPCC | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఫహీం

Dec 1 2018 3:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

 Phahim Is The General Secretary Of TPCC - Sakshi

పీసీసీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో ఎం.ఎ.ఫహీం   

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యువ నాయు డు ఎంఏ ఫహీంను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

టీపీసీసీకి నూతనంగా ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులుగా నియమించగా, పటాన్‌చెరు నియోజకవర్గం ఐలాపూర్‌కు చెందిన ఫహీంకు చోటు దక్కింది. గతంలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించిన ఫహీం తర్వాతి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పీసీసీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరించిన ఫహీం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement