పెట్రోల్‌ బంకుల్లో చేతివాటం! | petrol bunks cheating with software changes in pumping | Sakshi
Sakshi News home page

మార్పిడి.. దోపిడీ

Dec 26 2017 9:41 AM | Updated on Sep 3 2019 9:06 PM

petrol bunks cheating with software changes in pumping - Sakshi

పెట్రోల్, డీజిల్‌ ధరల రోజువారీ సవరణలో ‘పాయింట్ల’ గోల్‌మాల్‌తో వాహనదారులు దోపిడీకి గురవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పుల వెసులుబాటు డీలర్లకు కాసులు కురిపిస్తోంది. ఇంధనం పాయింట్ల రూపంలో తక్కువగా పంపింగ్‌ జరుగుతుండటంతో వినియోగదారులు రూ.100కు సగటున రూ.2 నష్టపోతున్నారు.

జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి పెట్రో ధరలు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ధరల పెంపు కొనసాగుతోంది. కేవలం ఎప్పు డో ఒకసారి ధరలు తగ్గినా అది నామమాత్రమే. గతంలో 15 రోజులకు ఒకసారి  ధరలు పెరిగినప్పుడు వాటి ప్రభావం స్పష్టంగా కనిపించేది. ప్రస్తుతం రోజువారీ సవరణలతో పైసాపైసా పెరిగి వినియోగదారులపై కనిపించని భారం పడుతోంది. 

అంతా సాఫ్ట్‌వేర్‌ మహిమ..
పెట్రోల్‌ పంపింగ్‌ మెషిన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులచేర్పుల వెసులుబాటే డీలర్లు అక్రమాలు చేసేందుకు ఊతమిస్తోంది. రోజువారీ ధరల పెంపు విధానం అమలు చేసినప్పటి నుంచి పెట్రోల్‌ బంకుల ఆధునీకరణ జరగలేదు. అత్యధిక బంకులు మాన్యువల్‌గానే ధరలు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలోని చాలా బంకుల్లో ఉన్న మెషిన్లు పాతవే. రోజువారీ ధరల సవరణ ప్రకారం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రో ధరల సవరణ జరుగుతుంది. చమురు సంస్థలు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ముంబైలో ధరలు మార్చగానే, ఇక్కడ ఆధునీకరించిన బంకుల్లో యథాతథంగా ధరలు మారుతాయి. సాధారణ (మాన్యువల్‌) బంకుల్లో మాత్రం డీలర్లకు సవరణ ధర మొబైల్‌ సంక్షిప్త సమాచారం, ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా చేరుతోంది. వీరు ధరలు మార్చాల్సి ఉంటుంది. ధరలు పెరిగినప్పుడు వెంటనే మార్చుతున్న డీలర్లు... తగ్గినప్పుడు మాత్రం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

దోపిడీ ఇలా..
వాహనదారులు పెట్రోల్, డీజిల్‌ సాధారణంగా రూపాయల్లో పోయించుకుంటారు. కానీ చమురు సంస్థలు లీటర్లలో లెక్క కట్టే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. దీంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో లీటర్ల చొప్పున కాకుండా రూ.100–రూ.500 వరకు పోయించుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకు తగ్గట్టు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉంది. సాఫ్ట్‌వేర్‌ రూపొందించే క్రమంలో రూపాయికి సమీపం(నియరెస్ట్‌ టు రుపీ)గా తీర్చిదిద్దారు. ఇదే డీలర్లకు కలిసి వస్తోంది. పంపింగ్‌లో పాయింట్లు తగ్గి వాహనదారులకు నష్టం తప్పడం లేదు. దీంతో రూ.100కు కనీసం రూ.2 నష్టపోతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement