రోడ్డుపై గేదెలను కట్టేసినందుకు జరిమానా

Person Fined With Two Thousand Rupees In Chennur - Sakshi

సాక్షి, చెన్నూర్‌ : మనషులకే కాదు జంతువులకు కూడా రూల్స్ వర్తిస్తాయని నిరూపించారు ఓ మహిళా అధికారిణి . ఓ వ్యక్తి తన గేదెలను రోడ్డుపై కట్టేసినందుకు జరిమానా చెల్లించిన వింత ఘటన చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలలోని కత్తెరసాల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం రోడ్డుపై పశువులను కట్టేసినందుకు మల్లవేన పెద్ద పోషంకు రూ.2000 జరిమానా విధించినట్లు ప్రత్యేకాధికారి గంగాభవానీ తెలిపారు. ఇక నుంచి ఎవరూ రోడ్లపై పశువులు కట్టేయొద్దని సూచించారు. రోడ్లపై పశువులను కట్టేసినా, చెత్త వేసినా జరిమానా వేస్తామన్నారు. అలాగే రోడ్లపై పాదులను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోట మధుకర్, కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top