తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. వ్యక్తి మృతి | person died with cool weather in adilabad district | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. వ్యక్తి మృతి

Jan 24 2016 7:07 PM | Updated on Sep 3 2017 4:15 PM

చలి పులి పంజా విసురుతోంది.

జన్నారం(ఆదిలాబాద్) : చలి పులి పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలకు పడిపోతోంది. జన్నారం మండల వాసులు చలికి బెంబెలెత్తుతున్నారు.  చలి తీవ్రతకు తట్టుకోలేక మండలంలోని పొన్కల్‌కు చెందిన గోలి దుబ్బయ్య(59) మృతిచెందాడు. దుబ్బయ్య భార్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త దుబ్బయ్య వృత్తి రీత్యా బట్టలు ఉతుకుతూ.. ఇస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం వేకువజామున 3గంటలకు చలికి తట్టుకోలేకపోయూడు. దుప్పటి కప్పమని భార్యకు సూచించాడు. భార్య అతడికి దుప్పటి కప్పి నిద్రపోయింది. తెల్లవారినా భర్త లేవకపోవడంతో వెళ్లి చూసింది. చలి తీవ్రతకు తట్టుకోలేక భర్త దుబ్బయ్య చనిపోయాడని గుర్తించింది. మృతుడు దుబ్బయ్యకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement