ఇసుకలో అప్పడం కాల్చిన జవాను | Sakshi
Sakshi News home page

ఇసుకలో అప్పడం కాల్చిన జవాను

Published Wed, May 22 2024 1:16 PM

BSF Jawan Baked Papad on Hot Sand in Bikaner

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.

రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బికనీర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్‌ఎప్‌ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

బీఎస్‌ఎఫ్‌ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్‌లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్‌లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement