పంజా విసురుతున్న డెంగీ | peoples are concern on dengue | Sakshi
Sakshi News home page

పంజా విసురుతున్న డెంగీ

Sep 12 2014 1:23 AM | Updated on Oct 9 2018 7:11 PM

పంజా విసురుతున్న డెంగీ - Sakshi

పంజా విసురుతున్న డెంగీ

డెంగీ మళ్లీ విజృంభిస్తోంది. పారిశుధ్యలోపం, విచ్చలవిడిగా పందుల సంచారం, దోమలపై నియంత్రణ కరువవడంతోనే డెంగీ ప్రబలుతోంది.

బాన్సువాడ : డెంగీ మళ్లీ విజృంభిస్తోంది. పారిశు ధ్య లోపం, విచ్చలవిడిగా పందుల సంచా రం, దోమలపై నియంత్రణ కరువవడంతోనే డెంగీ ప్రబలుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పందులను అదుపు చేయాలని నెల రోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీ అధికారులకు ఆదేశించినా వారు పెడచెవిన పెడుతున్నారు. గత ఏడాది వర్ని మండలం రుద్రూర్‌లో డెంగీతో సౌమ్య (19) అనే యువతి మృతి చెందగా, ఆ సంఘటన జరిగిన 15 రోజులకే బాన్సువాడలోని మిస్రీ గల్లీలో నివసించే మొ హియొద్దీన్ పటేల్ (65) అనే రిటైర్డ్ ఆర్‌టీసీ ఉద్యోగి మృతి చెందారు. బాన్సువాడకే చెందిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
 
కనిపించని పారిశుధ్యం
కలుషిత నీరు సేవించడంతో డయేరియా కూ డా పంజా విసురుతోంది. ఇటీవల కురిసిన వానలు, ఎప్పటికప్పుడు తొలగించని చెత్తా చెదారంతో వీధులు దుర్గంధభరితమయ్యా యి. పారిశుధ్య బాధ్యతను నిర్వహించడం లో పంచాయతీలు విఫలమవుతున్నాయి. అ రకొర నిధులు, తగినంత సిబ్బంది లేకపోవ డం, సర్పంచుల పర్యవేక్షణ లోపించడంతో పరిపాలన గాడి తప్పుతోంది. అంటురోగా లు ప్రబలుతాయన్న ముందు చూపు అధికారులకు లేపోవడంతో పట్టణాలు, గ్రామాలు దుర్గంధానికి నిలయాలుగా మారుతున్నా యి. దీంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికి పందులు కూడా తోడవడంతో జనావాసాలు మురికి కూపాలను తల పిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మురికి నీరు కాలువలా ప్రవహిస్తోంది.
 
సమస్యల పరిష్కారమేదీ?
గ్రామాలలో తాగునీరు, వీధి దీపాలు, పారి శుధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంది. వీధి దీపాలు, పారి శుధ్యం పనుల మాట దేవుడెరుగు కనీసం తాగునీటి సౌకర్యం కల్పించడంలో కూడా పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బాన్సువాడ, బీ ర్కూర్, కోటగిరి, వర్ని మండలాల మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కోనాపూర్, హన్మాజీపేట, ఇబ్రాహీంపేట, బరంగెడ్గి, హంగర్గ తదితర గ్రా మాలలో పారిశుధ్యం గురించి పట్టించుకొనేవారు కరువయ్యారు.
 
వైద్యశాఖ అధికారులెక్కడ?
ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేసుకుని వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు సైతం పట్టించుకోవ డం లేదు. గ్రామస్థాయి అధికారుల మధ్య స మన్వయం లోపిస్తోంది. 13వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులను పారిశుధ్య పనులకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఎవ్వరూ ఆ వైపున దృష్టి సారించలేదు. గ్రామాలలో రోజూ ప్రజలకు సరఫరా చేసే నీటిని ఏఎన్‌ఎంలు పరీక్షలు చేయాల్సి ఉండగా వారూ నిర్లక్ష్యం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement