ఆకర్షణీయంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు 

People Getting Attracted Towards Online Classes Due To Coronavirus - Sakshi

టీమ్స్‌ అప్లికేషన్‌కు మరిన్ని హంగులు జోడిస్తున్న మైక్రోసాఫ్ట్‌

ఒకేతెరపై 49 మంది విద్యార్థుల్ని చూసే అవకాశం

క్విజ్‌లు నిర్వహించేందుకు స్వే సాఫ్ట్‌వేర్‌

బొమ్మలు గీసేందుకు పెయింట్‌ 3డీ సాఫ్ట్‌వేర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ తన ‘టీమ్స్‌’ అప్లికేషన్‌కు మరిన్ని హంగులు జోడించింది. ‘టీమ్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో తాను సొంతంగా అభివృద్ధి చేసిన, ఇతరుల అప్లికేషన్లను కూడా చేర్చింది. ఇతర ఆన్‌లైన్‌ మీటింగ్‌ అప్లికేషన్ల మాదిరిగా కాకుండా..విద్యార్థులు అప్లికేషన్‌ ఆన్‌ చేసి తమ పనుల్లో ఉండిపోకుండా చూస్తుంది. అంతేకాదు..అవసరమైనప్పుడు నేరుగా ప్రశ్నలు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది కూడా. ఈ మార్పులు చేర్పులు చేసేందుకు తాము విస్తృతమైన కసరత్తు చేశామని, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత తమ దృష్టికి వచి్చన లోటుపాట్లను సవరించామని మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఆన్‌లైన్‌ క్లాస్‌లేనా? 
కరోనా కారణంగా ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ తరగతులకు డిమాండ్‌ బాగా పెరిగిన విషయం తెలిసిందే. జూమ్‌ వంటి అప్లికేషన్లపై పలు అభ్యంతరాలు వినిపిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. ఈ విద్యా సంవత్సరం తరగతులు మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే నడుస్తాయని తాము సర్వే చేసిన వారిలో 61 శాతం మంది భావిస్తున్నారని, అలాగే ఒకవేళ పాఠశాలకు వెళ్లే పరిస్థితి మళ్లీ వచి్చనా.. తరగతి గదిలో టెక్నాలజీ పాత్ర చాలా ఎక్కువ అవుతుందని 87 శాతం మంది చెప్పారని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. న్యూఢిల్లీలోని ద బ్రిటిష్‌ స్కూల్‌తోపాటు పలు ఇతర పాఠశాలలు ఇప్పటికే టీమ్స్‌ అప్లికేషన్‌ను వాడటం మొదలుపెట్టాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది విద్యకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఆన్‌లైన్‌లో తరగతి గదుల్లో విద్యార్థుల దృష్టి మరలకుండా, వారిలో ఆసక్తి తగ్గకుండా చూసేందుకు టీమ్స్‌ అప్లికేషన్‌లో ఉపాధ్యాయులకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని వివరించింది.

ఇవీ మార్పులు.. 
► కంప్యూటర్‌ తెరపై ఏకకాలంలో 49 మందిని ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం. విద్యార్థులందరినీ ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ఉపాధ్యాయులకు వీలు ఏర్పడుతుంది. 
► ఒక తరగతి గదిలోని విద్యార్థులను వేర్వేరు బృందాలుగా విడగొట్టి చిన్న చి న్న టాస్‌్కలు ఇచ్చేందుకు అవకాశం. దీ న్ని వర్చువల్‌ బ్రేక్‌అవుట్‌ అని పిలుస్తున్నారు.  
► తరగతి ఆఖరులో క్విజ్‌లు నిర్వహించేందుకు, విద్యార్థులు స్వయంగా ప్రెజెంటేషన్లు తయారు చేసేందుకు ‘స్వే’సాఫ్ట్‌వేర్, మల్టీమీడియా కంటెంట్‌ తయారీకి ‘బన్సీ’, చిత్రాలు గీసేందుకు ‘పెయింట్‌ 3డీ’ వంటివి అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఈ కంటెంట్‌ను ఇతరులతో పంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులు అందరూ నింపి తిప్పి పంపాల్సిన దస్తావేజుల కోసం మైక్రోసాఫ్ట్‌ ఫామ్స్‌ ఉపయోగపడుతుంది.  
► సందేహాలు వస్తే విద్యార్థులు డిజిటల్‌ రూపంలో చేతులెత్తి టీచర్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తరగతి అటెండెన్స్‌ దానంతట అదే నమోదు అవుతుంది. ఏయే విద్యార్థులు చురుకుగా ఉన్నారు? ప్రశ్నలు వేశారు? ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ ఎందరు, ఎంత కాలంలో పూర్తి చేశారు? వంటి సమాచారాన్ని సేకరిం చడమే కాకుండా.. దాన్ని విశ్లేషించడమూ సాధ్యమవుతుంది. 
► కహూట్, ప్రెజీ, జీవో1, నియర్‌పాడ్, పియాజ్జా, గ్యాగల్, కాన్వాస్‌ వంటి వినూత్నమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల జోడింపు. చదవడం, రాయడంలో సమస్యలు ఎదుర్కొనే డిస్‌లెక్సియా పిల్లల కోసం ఇమ్మర్సివ్‌ రీడర్‌ ను సిద్ధం చేసిన మైక్రోసాఫ్ట్‌ దాన్నిప్పు డు ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌లోకి చేర్చింది. ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారి మాతృభాషలోనే మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్‌ ట్రాన్స్‌లేటర్‌ ఉపయోగపడుతుందని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top