బాధితులకు పరిహారం చెల్లించాలి | pay compensation to the victims | Sakshi
Sakshi News home page

బాధితులకు పరిహారం చెల్లించాలి

Apr 5 2017 1:48 AM | Updated on Sep 5 2017 7:56 AM

ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాకే చెర్లగూడెం రిజర్వాయర్‌ పనులు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు.

మర్రిగూడ(మునుగోడు): ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాకే చెర్లగూడెం రిజర్వాయర్‌ పనులు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. బాధితులను పట్టించుకోకుండా పోలీస్‌ పహారాలో రిజ ర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టడం దారుణమని అన్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో మంగళవారం ఎంపీ చెర్లగూడెం ముంపు బాధితులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

బాధిత రైతులు అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని ఎంపీ భరోసా కల్పించారు. అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లెవనెత్తి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మంచబోయే ప్రతి ప్రాజెక్టు కింద ముంపునకు గురై భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి 123 జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. ఆ జీఓను హైకోర్టు కొట్టివేసిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ మండిపడ్డారు.

ఇలాంటి ఎమ్మెల్యేను చూడలేదు..
‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు’ అని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యేనే కాంట్రాక్టర్‌ వద్ద డబ్బులకు ఆశపడి పోలీసులతో రైతులను బెదిరించడం దారుణమన్నారు.కొంత మంది బ్రోకర్లను పెట్టుకుని ఎమ్మెల్యేనే దందాలకు తెగబడుతున్నాడని ఎంపీ ఆరోపించారు. కూసుకుంట్లకు సీఎం కేసీ ఆర్‌ వద్ద కూడా మంచి పేరు లేదని అన్నారు. ఇప్పటికైనా తీ రు మార్చుకోవాలని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి, ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మేతరి యాదయ్య, మాల్‌ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ పాల్వాయి అనిల్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పొనుగోటి విజయరామారావు, మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మద్ది విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు పాముల యాదయ్య, కంచకంట్ల వసంతలక్ష్మీ, నాయకులు చిట్యాల రంగారెడ్డి, సిరపగ్రఢ అనందరావు, మల్గిరెడ్గి గోవర్ధన్‌రెడ్డి,  రైతులు నేర్లకంటి రామలింగం, ఐతగోని వెంకటయ్య, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement