కొలువుల.. కోలాహలం

Panchayati Raj Notification Nalgonda - Sakshi

నల్లగొండ : జిల్లాలో పంచాయతీ కొలువుల కోలాహలం మొదలైంది. 661 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. పో స్టుల విషయంలో స్థానికులకే అవకాశం కల్పించడంతో జిల్లాలో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. తమకే ఉద్యోగాలు వస్తాయన్న ఆనందం వారిలో కనిపిస్తోంది  ‘‘దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు’’ అన్న నానుడికి అనుగుణంగా సర్కార్‌ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.

ఇన్నాళ్లూ పంచాయతీల్లో అధికారులు లేక పాలన పడకేసింది. ఒక్కొక్కరు రెండునుంచి నాలుగు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. దీంతో వారు విధుల ఒత్తిడితోపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడుతుండడంతో పంచాయతీల్లో పాలన సజావుగా సాగే అవకాశాలు కనిపస్తున్నాయి.కొత్తగా జిల్లాకు మంజూరైన కొలువులు రాష్ట్రప్రభుత్వం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పూనుకుంది. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేíసన విషయం తెలిసిందే. జిల్లాకు 661 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. వీటిని శాఖ పరంగా భర్తీ చేస్తుండడంతో త్వరితగతిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

జిల్లాలో మొత్తం పంచాయతీలు 844
జిల్లాలో మొత్తం 844 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పాత గ్రామపంచాయతీలు 502 ఉన్నాయి.ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తం డాలను, గూడాలను పంచాయతీలుగా చేసింది. దీంతో కొత్తగా 349 గ్రామ పంచాయతీలు  ప్రస్తుతం ఉన్న కార్యదర్శులు 185మందేజిల్లాలో కొత్త, పాత కలిపి మొత్తం గ్రామ పంచాయతీలు 844 ఉండగా, కార్యదర్శులు 185 మంది మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. ఉన్న వారి విధులు పంచడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు పంచాయతీల అదనపు బాధ్యతలు అప్పగించారు. వారు రోజుకో పంచాయతీకి వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఏ పంచాయతీపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. అటు సమస్యలు పరిష్కారం కాక, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దీనికితోడు కార్యదర్శులు పనిభారం ఎక్కువై సతమతమయ్యేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు కొత్తగా 661 పోస్టులను మంజూరు చేసింది. పాత సిబ్బంది 185 మందితోపాటు కొత్తగా 661 మంది వస్తే 846 మంది అవుతారు. అయితే మనకు ఉన్న ఉన్నది 844 పంచాయతీలు. అంటే ఇద్దరు మిగులుతున్నారు. వీరిలో ఒకరు పదోన్నతిపై యాదాద్రి జిల్లాకు వెళ్తుండగా, మరొకరు చిట్యాల మున్సిపాలిటీకి వెళ్తారు. దీంతో 844 మంది అవుతారు. ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి ఉంటారు. కొత్త పోస్టులు భర్తీ అయితే ఇబ్బందులు తొలగడంతోపాటు పంచాయతీ పాలన పరుగులు పెట్టే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top