కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు
- మరొకరికి తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి(కరీంనగర్ జిల్లా)
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. జగన్నాధపురం శివారులో బావి తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి మల్లయ్య(55), రాజు(30) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.