లారీ కిందపడిన బైక్.. ఒకరి మృతి | one Died in Larry Accident | Sakshi
Sakshi News home page

లారీ కిందపడిన బైక్.. ఒకరి మృతి

Oct 14 2015 7:59 PM | Updated on Sep 3 2017 10:57 AM

వేగంగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడటంతో ఒకరు మృతి చెందారు.

వేగంగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ జిల్లా మామ్నూరులోని టీఎస్‌ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెరికేడు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి బోసు(40), వెంకటేశ్వర్‌రావు(50), మరంశెట్టి సత్యనారాయణ(36) వరంగల్ మార్కెట్‌లో పత్తి అమ్మి తమ ద్విచక్రవాహనాలపై వరంగల్-ఖమ్మం రహదారిలో ఇంటికి బయలు దేరారు. టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు.

ఇదే సమయంలో ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement