బైక్ బోల్తాపడి ఒకరి మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తాపడి ఒకరి మృతి

Sep 8 2015 7:49 PM | Updated on Sep 3 2017 9:00 AM

అదుపుతప్పి ఓ బైక్ బోల్తా పడగా, ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

నేరేడుచర్ల: అదుపుతప్పి ఓ బైక్ బోల్తా పడగా, ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ సీతారామపురంకు చెందిన ఖలీల్ నేరేడుచర్లలో పని పూర్తి చేసుకుని బైక్‌పై తిరుగు ప్రయాణం అయ్యాడు.

రామగిరి వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పడంతో బండితోపాటు ఖలీల్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్‌వెల్ లారీ ఖలీల్ తలపై నుంచి ముందుకు వెళ్లింది. తల ఛిద్రమై ఖలీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement