బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officials refused thechild marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Jan 28 2016 6:27 PM | Updated on Sep 3 2017 4:29 PM

మైనర్ బాలికకు పెళ్లీ చేయాలనుకున్న ఓ కుటుంబానికి రెవెన్యూ అధికారులు నచ్చజెప్పి బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన గురువారం మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేటలో జరిగింది.

మైనర్ బాలికకు పెళ్లీ చేయాలనుకున్న ఓ కుటుంబానికి రెవెన్యూ అధికారులు నచ్చజెప్పి బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన గురువారం మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేటలో జరిగింది.

తహశీల్ధార్ అరుణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తోళ్ల లక్ష్మి, చంద్రయ్య పద్నాలుగేళ్ల కూతురు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. మైనర్ అమ్మాయికి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల్ల స్వామితో వివాహాం చేయడానికి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి.. వివాహాన్ని రద్దు చేశారు. అనంతరం కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
 
Advertisement
 
Advertisement
Advertisement