సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు | Offensive posts in social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు

Aug 4 2017 9:20 AM | Updated on Oct 22 2018 6:05 PM

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు - Sakshi

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు

పోలీసుల పేరుతో సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యార్థినులు, మీడియాను కించపరుస్తూ కామెంట్లు.. పోలీసులకు ఫిర్యాదు
కరీంనగర్‌ క్రైం: పోలీసుల పేరుతో సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 28న విద్యారంగ సమస్యలపై విద్యార్థి నులు కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. అక్కడ తోపులాట జరి గింది. దీనికి సంబంధించిన ఫొటోలను విద్యార్థులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

దీనికి శివరాజు అనే పోలీసు ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ ‘ఇందులో మీడియా ఒక వైపున మాత్రమే చూపించిందని’ కామెంట్‌ పెట్టాడు. దీనికి సిరాజ్‌బాషా అనే పోలీస్‌ డ్రస్‌లో ఉన్న మరో వ్యక్తి విద్యార్థినులపై అసభ్యకరంగా పోస్ట్‌ చేశాడు. దీనికి తమరన్‌ శ్రీని వాస్‌ అనే మరో వ్యక్తి మీడియా, విద్యార్థినులపై రాయలేని విధంగా కామెంట్‌ చేశాడు. దీనిపై సామా జిక ఉద్యమకారుడు జి.సత్యం కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement