ఈసారి మంచి వర్షాలు | Now onwards Rains season will be good | Sakshi
Sakshi News home page

ఈసారి మంచి వర్షాలు

Jul 15 2014 12:40 AM | Updated on Sep 2 2017 10:17 AM

ఈసారి మంచి వర్షాలు

ఈసారి మంచి వర్షాలు

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

భవిష్యవాణి వినిపించిన అమ్మవారు
 సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారిని అంబారీపై ఊరేగించడం.. ఘటానికి సాగనంపడంతో లష్కర్ బోనాలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన భక్తులు భవిష్యవాణిని వినేందుకు ఆసక్తి చూపారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరీ అమ్మవారి ఆలయం ముందు జోగిని స్వర్ణలత పచ్చికుండపై నిలబడగా.. అమ్మవారు ఆవహించడంతో భవిష్యవాణి చెప్పారు.
 
  ‘ఈ ఏడాది పూజలతో సంతృప్తి చెందాను.. చాలా సంతోషంగా ఉంది.. మీరు తిన్నా తినకున్నా పువ్వో, పత్రో నాకు పెడుతున్నారు.. అదే నాకు సంతోషం.. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు... ఇదే నేను ప్రజలకిచ్చే దీవెన.. నాకు కోపం తెప్పించవద్దు.. తప్పు చేస్తే నా ఆగ్రహానికి గురికాక తప్పదు.. నా ఆజ్ఞ లేనిదే ఆలయంలో ఏ పని మొదలు పెట్టవద్దు.. ఇటీవల బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతై ఆ తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది కదా? అని భక్తులు ప్రశ్నించగా... ఎవరి ఖర్మ వారు అనుభవించాల్సిందే అది దైవనిర్ణయం... దీనికి ఎవరూ అతీతులు కారు’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement