రాజకీయ జోక్యానికి చెల్లుచీటీ..! | No politics in Anganwadi Employees Recruiting | Sakshi
Sakshi News home page

రాజకీయ జోక్యానికి చెల్లుచీటీ..!

Mar 24 2017 9:23 AM | Updated on Sep 17 2018 5:18 PM

రాజకీయ జోక్యానికి చెల్లుచీటీ..! - Sakshi

రాజకీయ జోక్యానికి చెల్లుచీటీ..!

అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యానికి తెరపడింది.

► అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల్లో పైరవీలకు చెక్‌
 
నల్లగొండ: అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యానికి తెరపడింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎమ్మెల్యేలకు చోటు కల్పించకుండా జిల్లా స్థాయిలో కొత్త కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయగా.. దీనికి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఉంటారు. అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాలకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎమ్మెల్యేలకూ అవకాశం కల్పించారు.
 
వారి కనుసన్నల్లో లేదా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఇంటర్వూ్యలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల అనుయాయులు, బంధువులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త కమిటీలో అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. ఇంటర్వూ్యలు కూడా లేవు. పదో తరగతి మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. 
 
మార్గదర్శకాలు..
► వివాహిత మహిళలే అర్హులు..
► పట్టణం లేదా గ్రామాల్లో అంగన్‌ వాడీ కేంద్రం పరిధిలో నివాసం ఉంటున్న స్థానిక మహిళలకే అవకాశం. 
► ఎస్టీ వాడల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎస్టీలు..ఎస్సీ వాడల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో  ఎస్సీలకు మాత్రమే ఉద్యోగాల్లో చోటుకల్పిస్తారు. ► ► అభ్యర్థుల ఎంపికకు వంద మార్కులు కేటాయించారు. పదో తరగతిలో మెరిట్‌ మార్కులు సాధించిన వారికి 80 మార్కులు, అనాథలకు పది,  వితంతువులు, దివ్యాంగులకు ఐదు మార్కుల చొప్పు న కేటాయించారు. 
 
కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాతే..
అంగన్‌ వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబ ంధించి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిం చాలని సూచించింది. మాతాశిశు మరణాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరో గ్యలక్ష్మి పథకం లబ్ధిదారుల సంఖ్య నమోదుతోపాటు సంబంధిత కేంద్రంలో గర్భిణులు, బాలింతల నమోదు సం ఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నా రు. అలా నమోదు చేసిన మూడు మాసాల్లో సగటున గర్భిణి, బాలింతల సంఖ్య కనీసం ఐదుగురు లేకుం డా తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను సమీప అంగన్‌వాడీ కేం ద్రాల్లో విలీనం చేస్తారు. ఈ విధంగా గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 26 కేంద్రాలను గుర్తించినా విలీనం చేయలేదు. వీటితోపాటు తాజాగా మళ్లీ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టాలి. 
 
ఎదురుచూపులు..
ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యంతో రెండేళ్లుగా ఎలాంటి నియామకాలు చేయలేదు. 2015లో చివరిసారిగా అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేశారు. అప్పటినుంచి అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 195 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో 52, మినీల్లో 56 టీచర్, 87 హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త కమిటీ ఏర్పాటు నేపథ్యంలో  త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement